కార్తికేయ‌ హిప్పీ టీజర్ : తెలుగులో మిమ్మల్ని పచ్చి తిరుగుబోతు అంటారు

కార్తికేయ‌ హిప్పీ టీజర్ : తెలుగులో మిమ్మల్ని పచ్చి తిరుగుబోతు అంటారు

టిఎన్ కృష్ణ డైరెక్షన్ లో ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ‌ నటిస్తోన్న సినిమా హిప్పీ. ఈ సినిమా టీజర్ ను న్యాచురల్ స్టార్ నాని బుధవారం రిలీజ్ చేశాడు. ‘ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో దాన్ని పట్టుకున్నారు..అచ్చ తెలుగులో మిమ్మల్ని పచ్చి తిరుగుబోతు అంటారు తెలుసా..’అని కమెడియన్ వెన్నెల కిశోర్ చెప్పే డైలాగ్స్ తో హిప్పీ టీజర్ ప్రారంభమైంది. బాక్సర్ గా కార్తికేయ పంచ్ లు విసురుతున్నాడు. టీజర్ చూస్తుంటే కార్తీకేయ ఓ వైపు లవర్ బాయ్ గా,  బాక్సర్ గా అభిమానులకు వినోదాన్ని అందించనున్నాడని తెలుస్తోంది. క‌బాలి వంటి భారీ బ‌డ్జెట్ మూవీని నిర్మించిన క‌లైపులి ఎస్ థాను నిర్మాణంలో హిప్పీ తెరకెక్కుతోంది. ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ మూవీలో.. దిగాంగ‌న సూర్య‌వంశీ, జ‌జ్బా సింగ్ కార్తీకేయ సరసన హీరోయన్లుగా నటిస్తున్నారు.