తమిళ స్టార్ హీరో కార్తి హీరోగా నటించిన రీసెంట్ తమిళ మూవీ ‘వా వాతియార్’ (తెలుగులో ‘అన్నగారు వస్తారు’). ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది.
తమిళ వెర్షన్ ‘వా వాతియార్’ ఇప్పటికే జనవరి 28 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, తెలుగు వెర్షన్ అన్నగారు వొస్తారు మాత్రం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.
లేటెస్ట్గా ‘అన్నగారు వస్తారు’ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. “అన్నగారి ఆగమనం.. అన్నగారు వొస్తారు కొత్త సినిమా మార్చి 6 నుంచి ప్రైమ్ వీడియోలో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఇందులో కార్తీ ఈ మూవీ గురించి చెప్పే ఓ చిన్న వీడియోను పోస్ట్ చేసింది.
PSA: Anna Gari Aagamanam 📢#AnnagaruVostaruOnPrime, New Movie, March 6 @Karthi_Offl @IamKrithiShetty #NalanKumarasamy @Music_Santhosh @StudioGreen2 @gnanavelraja007 #Rajkiran #Sathyaraj #Anandaraj @GMSundar_ #Karunakaran pic.twitter.com/kWxcY2tCCv
— prime video IN (@PrimeVideoIN) March 3, 2026
ఆ వీడియోలో కార్తీ, “తమ్ముళ్లు, చెల్లెళ్లు.. అందరూ బాగున్నారా..” అంటూ ఎన్టీఆర్ శైలిలో డైలాగ్ చెప్పడం ఆకట్టుకుంటోంది. లెజెండరీ నటుడు ఎన్టీఆర్ అభిమానులకు ఇది ఒక గిఫ్ట్‌లా ఉంటుందని, సమాజంలో జరుగుతున్న ఒక చెడు విషయాన్ని ప్రశ్నించేందుకు ‘అన్నగారు’ వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందిందని కార్తీ తెలిపారు.
