Kaviya Maran : ఒక్క వికెట్కే ఎంత సంతోషమో.. పాపం మ్యాచ్ గెలిస్తే ఇంకేం చేసేదో

 Kaviya Maran : ఒక్క వికెట్కే ఎంత సంతోషమో.. పాపం మ్యాచ్ గెలిస్తే ఇంకేం చేసేదో

సన్ రైజర్స్ కో-ఓనర్ కావ్య మారన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఏప్రిల్ 07న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆమె హల్ చల్ చేసింది.  సన్ రైజర్స్ విధించిన 122 పరుగల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన లక్నో  తొలి వికెట్ ను తొందరగానే కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ ఫరుకీ వేసిన బంతిని ఆడే క్రమంలో  కైల్ మేయర్స్ మాయాంక్ అగర్వాల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అయితే అతని వికెట్ పడగానే కావ్య  మారన్ సంతోషం మాములుగా లేదు. కుర్చీలో నుంచి పైకి లేచి గట్టిగట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకుంది. పాపం ఈ సంతోషం ఆమెకు కొద్దిసేపు కూడా లేదు. లక్ష్యం చిన్నది కావడంతో లక్నో నిలకడగా ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో కావ్య  మళ్లీ నిరాశకు గురైంది.

దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  ఒక్క వికెట్ కే ఇంత అనందపడిపోతే ఎట్లా.. ఇక మ్యాచ్ గెలిస్తే ఇంకెంత ఆనందపడేదానివో  అంటూ నెటిజన్లు ఆమెను ఉద్దేశిస్తూ  కామెంట్స్ చేస్తున్నారు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.ఐపీఎల్ 16 సీజన్ లో సన్ రైజర్స్ కి ఇది రెండో ఓటమి కావడం గమనార్హం.