ఈ లిస్ట్ చూడండి ఎంతుందో.. ఒకే స్కూటీపై 233 చలాన్లు.. ఫైన్ ఎంతో తెలుసా..?

ఈ లిస్ట్ చూడండి ఎంతుందో.. ఒకే స్కూటీపై 233 చలాన్లు.. ఫైన్ ఎంతో తెలుసా..?

కాజీపేట, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఒక స్కూటీపై రికార్డు స్థాయిలో 233 చలాన్లు నమోదయ్యాయి. మొత్తంగా రూ.45 వేలకు పైగా ఫైన్లు పెండింగ్ ఉండగా ట్రాఫిక్ పోలీసులు బండిని సీజ్ చేశారు. వివరాల్లోకెళ్తే.. కాజీపేట ట్రాఫిక్ సీఐ వెంకన్న శనివారం (జూన్ 21) సిబ్బందితో కాజీపేట చౌరస్తాలో వెహికల్ చెక్ చేస్తుండగా, హనుమకొండ ప్రాంతానికి చెందిన అస్లం స్కూటీపై వెళ్తుండగా పట్టుకున్నారు. 

ఆ స్కూటీపై పెండింగ్ చలాన్లు తనిఖీ చేయగా, ఏకంగా 233 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటి మొత్తం రూ.45,350 కావడంతో జరిమానా మొత్తం చెల్లించే వరకు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకన్న తెలిపారు.