నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం.. సాయంత్రం సర్జరీ: హరీశ్ రావు

నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం.. సాయంత్రం సర్జరీ: హరీశ్ రావు

మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.  కేసీఆర్ కు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు చెప్పారన్నారు.  టెస్టుల తర్వాత  కేసీఆర్ కు హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారన్నారు. డిసెంబర్ 8న రాత్రి యశోద ఆస్పత్రి డాక్టర్లు ప్రస్తుతం సర్జరీకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.

కేసీఆర్ అభిమానులెవరూ ఆస్పత్రికి రావొద్దని సూచించారు హరీశ్ రావు. ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఉన్నందున ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుందామన్నారు. 

డిసెంబర్ 7న అర్థరాత్రి కేసీఆర్ తన ఫాంహౌజ్ లోని బాత్రూంలో కాలు జారి పడ్డారు. దీంతో కాలుకి తీవ్ర గాయం అయ్యింది. అర్థరాత్రి 2 గంటల తర్వాత కేసీఆర్ ను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు.  మరోవైపు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ను చూసేందుకు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.