సీఎం పదవికి కేసీఆర్​ రాజీనామా

సీఎం పదవికి కేసీఆర్​ రాజీనామా

కేసీఆర్​ సీఎం పదవికి రాజీనామా చేశారు.  ఆయన స్వంత వాహనంలో వెళ్లి ఓఎస్డీ ద్వారా రాజ్ భవన్​ కు రాజీనామా లేఖను సమర్పించారు,  ప్రగతిభవన్​ నుంచి సాధారణ వ్యక్తిగా  కాన్వాయ్​ లేకుండా ఓఎస్డీ కార్యాలయానికి  వెళ్లారు.  ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 61 స్థానాలు దాటి స్పష్టమైన మెజార్టీగా దిశగా కాంగ్రెస్ పయనిస్తోంది. తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలకున్న బీఆర్ఎస్‌కు ప్రజలు షాకిచ్చారు.   బీఆర్ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వస్తోన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ప్రజా తీర్పును గౌరవించి సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు.  ఆయన ఎలాంటి కాన్వాయ్​ లేకుండా స్వంత వాహనంలో  వెళ్లారు. ఓఎస్డీకి రాజీనామా సమర్పించిన అనంతరం కేసీఆర్​ ఫామ్​ హౌస్​ కు వెళ్లారు.