బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో కేసీఆర్ రోడ్ షో జోష్

బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో కేసీఆర్ రోడ్ షో జోష్

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్డు షో.. ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. గురువారం రాత్రి 7.30 గంటలకు కరీంనగర్ సిటీకి చేరుకున్న ఆయనకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో  లీడర్లు ఘన స్వాగతం పలికారు. జనం భారీగా తరలివచ్చారు. ఒకవైపు వాతావరణం చల్లబడడం, ఆకాశం మేఘావృతం కావడంతో వర్షం పడుతుందని బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు గురైనప్పటికీ.. రోడ్ షో ముగిసే వరకు ఎలాంటి అంతరాయం కలగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.