నువ్వు సూపర్ అన్న: షార్ట్ ఫిలిమ్స్తో స్టార్ అయ్యి..ఇప్పుడు ఏకంగా కీర్తి సురేష్తో ఇలా

నువ్వు సూపర్ అన్న: షార్ట్ ఫిలిమ్స్తో స్టార్ అయ్యి..ఇప్పుడు ఏకంగా కీర్తి సురేష్తో ఇలా

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్(Suhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ప్రారంభంలో షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేసిన ఈ నటుడు.. మెల్లిగా సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించడం మొదలుపెట్టాడు. ఇప్పటికీ సుహాస్ చేతిలో ఓ అరడజను పైగా సినిమాలు రిలీజ్ కు దగ్గర్లో ఉన్నాయి. అందులో సుహాస్ మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh)తో కలిసి నటించిన ఉప్పు కప్పురంబు మూవీపై మరింత ఆసక్తి నెలకొంది. 

తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు సుహాస్. ఐ.వి. శశి దర్శకత్వంలో ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధికా లావు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు సుహాస్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. " నా తదుపరి చిత్రం ఉప్పుకప్పురంబు మూవీ షూటింగ్ నిన్న రాత్రితో ముగిసింది. మహనటి కీర్తి సురేష్తో పాటు అలాగే సినిమా యూనిట్ అందరితో కలిసి వర్క్ చేయడం ఎంతో బాగుంది" అని ఫొటోస్ పోస్ట్ చేసాడు సుహాస్.ఈ సందర్బంగా కీర్తి సురేష్ తో దిగిన ఫొటోకు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suhas (@suhassssssss)

షార్ట్ ఫిలిమ్స్తో స్టార్ అయ్యి..ఇప్పుడు ఏకంగా కీర్తి సురేష్ లాంటి స్టార్స్తో సినిమాలు చేస్తున్నావంటే మామూలు విషయం కాదన్నా సుహాసన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ తన ఓటీటీ కోసం తెరకెక్కుతున్న ఒరిజినల్ మూవీ ఇది.