వెంకీ మామకు జోడీగా ..కీర్తి సురేష్.!

వెంకీ మామకు జోడీగా ..కీర్తి సురేష్.!

బ్యాక్ టు బ్యాక్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తోంది కీర్తి సురేష్.  ఓ వైపు ఫిమేల్ లీడ్‌‌గా నటిస్తూనే, మరోవైపు స్టార్ హీరోలకు జోడీగానూ అలరిస్తోంది. ఇప్పటికే చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె మరో క్రేజీ చాన్స్ అందుకుందని తెలుస్తోంది. సీనియర్ హీరో  వెంకటేష్‌‌కు జంటగా కీర్తి కనిపించబోతోందని సమాచారం.

 ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్‌‌ గారు’ చిత్రంతో  బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీ వెంకటేష్ హీరోగా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో వెంకీకి జంటగా పూజా హెగ్డే సహా పలువురు పేర్లు వినిపించగా, కీర్తి సురేష్‌‌ను ఫైనల్ చేశారనే  టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రంలో  మలయాళ హీరో ఫహద్ ఫాజిల్‌‌  కీలకపాత్ర పోషించబోతున్నట్టు ప్రచారంలో ఉంది. 

తన రాబోయే చిత్రం వెరైటీ టైటిల్‌‌తో తెరకెక్కనుందని అనిల్ రావిపూడి చెప్పగా, ఇందులోని నటీనటులపై మాత్రం వరుస గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. వీటిలో నిజానిజాలు తెలియాలంటే అనిల్ నుంచి  అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్ రావాల్సి ఉంది. మరోవైపు కీర్తి సురేష్ మాత్రం  ప్రస్తుతం  విజయ్ దేవరకొండకు జంటగా ‘రౌడీ జనార్థన్’ చిత్రంతోపాటు,  తమిళ, మలయాళ, హిందీ  సినిమాలు  చేస్తోంది.