ఓ వైపు హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్తోనూ బిజీగా ఉంది. శనివారం తన పుట్టినరోజు. ఈ సందర్భంగా తను నటిస్తున్న చిత్రాల నుంచి పోస్టర్స్, వీడియోలతో మేకర్స్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘జనవరి 12 విడుదల’ అనే మల్టీస్టారర్‌లో నటిస్తోంది.
వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. లతారెడ్డి అనే పాత్ర పోషిస్తున్న కీర్తి.. తలకు స్కార్ఫ్, కళ్లకు సన్‌గ్లాసెస్‌తో ట్రాక్టర్ నడుపుతూ కనిపించింది. ప్రస్తుతం ఊటీలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇక విజయ్ దేవరకొండకు జంటగా ‘రౌడీ జనార్థన’లో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
‘‘చిన్న బొట్టు..పెద్ద పెద్ద కళ్ళు.. పొడవాటి జడ.. ఎంత అందంగుంటదో..” అంటూ ఈ చిత్రం నుంచి తనకు బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మరోవైపు కీర్తి సురేష్ లీడ్ రోల్లో నటించిన హిందీ వెబ్ సిరీస్ ‘అక్క’ నుంచి టీజర్ విడుదలైంది. ఇందులో భవానీ అనే లేడీ గ్యాంగ్‌స్టర్‌గా పవర్ఫుల్ రోల్లో, మాస్ మ్యానరిజమ్స్‌తో ఇంప్రెస్ చేసింది కీర్తి. ఈనెల 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆమె లాయర్‌గా నటించిన ‘సత్యవాన్ సావిత్రి’ చిత్రం నవంబర్ 20న రిలీజ్ కానుంది.
