వైరల్ కుంభమేళా మోనాలిసా కేసులో ఊహించని ట్విస్ట్.. ప్రొటెక్షన్ ఆర్డర్ రద్దు చేసిన కేరళ హైకోర్ట్

వైరల్ కుంభమేళా  మోనాలిసా కేసులో ఊహించని ట్విస్ట్.. ప్రొటెక్షన్ ఆర్డర్ రద్దు చేసిన కేరళ హైకోర్ట్

వైరల్ కుంభమేళా ఉమెన్ మోనాలిసా  వివాహం వివాదంలో ఒక ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమెకు రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులను కేరళ హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది.జస్టిస్ బెచ్చు కురియన్ థామస్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

 అసలు విషయం ఏంటంటే.. మోనాలిసా తన పిటిషన్‌లో ఇచ్చిన ఫోన్ నెంబర్, అడ్రస్ ఆధారంగా ఆమెను సంప్రదించడానికి పోలీసులు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె ఆచూకీ కనిపెట్టడం సాధ్యం కావడం లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. పైగా గతంలో కూడా ఇలాగే కోర్టు రక్షణ కల్పించమన్నా.. ఆమె పోలీసులకు దొరకకుండా పోవడం ఒక అలవాటుగా మారిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ALSO READ : సుప్రీంకోర్టులో హైడ్రామా:  జడ్జీలపై పేపర్లు విసిరేసి.. సీజేఐపై దురుసుగా ప్రవర్తించిన  పిటిషనర్

ఆమె అడ్రస్ లేనప్పుడు ప్రొటెక్షన్ ఎలా ఇవ్వాలో అర్థం కావడం లేదంటూ పోలీసులు ప్రాక్టికల్ ఇబ్బందులను వివరించారు. దీనిపై మోనాలిసా తరపు లాయర్ స్పందిస్తూ.. ప్రస్తుతం తన క్లయింట్ నుండి ఎలాంటి సమాచారం లేదని కోర్టుకు చెప్పారు.

దీంతో కోర్టు జూన్ 19న ఇచ్చిన ప్రొటెక్షన్ ఆర్డర్‌ను కొట్టేసింది. అయితే ఒకవేళ ఆ మహిళ నేరుగా పోలీసులను లిఖితపూర్వకంగా ఆశ్రయించి రక్షణ కోరితే చట్టప్రకారం ప్రొటెక్షన్ ఇవ్వవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 21కి వాయిదా వేసింది కోర్టు.