జులై 25న ఖమ్మంలో జాబ్ మేళా

జులై 25న ఖమ్మంలో జాబ్ మేళా

ఖమ్మం టౌన్, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 25న ఖమ్మం హవేలీ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న టీటీడీసీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్. మాధవి గురువారం తెలిపారు. 

జాబ్ మేళాలో భారత్ హ్యుందాయ్, వరుణ్ మోటార్స్, అపోలో ఫార్మసీ సంస్థలు పాల్గొననున్నట్లు చెప్పారు. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ పాస్ అయినవారు అర్హులన్నారు. జాబ్ మేళాకు సంబంధించిన వివరాల కోసం 70369 02902, 82476 56356 నంబర్లలో సంప్రదించాలన్నారు.