ఇది కరెక్ట్ కాదు : ఖుష్బూ

ఇది కరెక్ట్ కాదు : ఖుష్బూ

సిటిజన్‌‌షిప్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల విషయమై సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఇలా ట్వీట్ చేశారు. ‘‘ఇది ప్రొటెస్ట్ కాదు… హింస. ఇలా బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు.

రాజ్యాంగాన్ని, ప్రాథమిక హక్కుల్ని గౌరవించకుండా ఇలా ప్రవర్తించడం తగదు. దీనివల్ల మనమంతా ఒకటేనన్న భావన దెబ్బ తింటుంది. న్యాయం కోసం పోరాడే పద్ధతి ఇది ఎంతమాత్రం కాదు. దీన్ని ఖండించి తీరాల్సిందే.’’ అని ట్వీట్ చేశారు.