కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కర్ణాటకలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ రోజు ( సెప్టెంబర్ 2, 2026 ) సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు సర్‌ప్రైజ్ఇచ్చారు సినీ మేకర్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో, సుప్రియాన్వి పిక్చర్ స్టూడియో సమర్పణలో రూపుదిద్దుకుంటున్న పీరియాడిక్ విజువల్ వండర్ మూవీ టైటిల్ ను టైటిల్ అనౌన్స్‌మెంట్ . ఈ చిత్రానికి 'దేవరాయ' పేరును ఖరారు చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు.
రాయలవారిగా సుదీప్..
విజయనగర సామ్రాజ్య చక్రవర్తి, విజేత శ్రీకృష్ణదేవరాయల మహోన్నత గాథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాయలవారిగా సుదీప్ రాజసం, గంభీరమైన రూపం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. 'హనుమాన్' ఫేమ్ గౌరహరి అందించిన నేపథ్య సంగీతం, గ్రాండ్ విజువల్స్ ఈ పీరియడ్ డ్రామా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లాయి. బిగ్ స్క్రీన్ పై ఈ విజువల్ కాన్వాస్ చూడటం ఒక వేడుకలా ఉండబోతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ 'దేవరాయ' వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. డిసెంబర్ 2027లో ఈ పాన్-ఇండియా దృశ్యకావ్యాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఆ మాస్టర్ మైండ్ ఎవరు?
అయితే, ఇక్కడే ఒక ఆసక్తికరమైన సస్పెన్స్ దాగి ఉంది. విజువల్స్, కాన్సెప్ట్, మ్యూజిక్, రిలీజ్ డేట్.. ఇలా ప్రచార చిత్రంతో సినిమాపై మైండ్ బ్లాకింగ్ హైప్ క్రియేట్ చేసిన యూనిట్.. దర్శకుడి పేరును మాత్రం రహస్యంగా ఉంచింది. ఇది కావలసి చేసిన పబ్లిసిటీ స్టంటా? లేక ఇంకా డైరెక్టర్‌ను ఫైనల్ చేయాల్సి ఉందా? ఏదైనా అగ్ర దర్శకుడి పేరుతో బాంబు పేల్చబోతున్నారా? అన్న ఈ ప్రశ్నలు ఇప్పుడు సినీ ప్రియుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
►ALSO READ | Pawan Kalyan : 'OG యూనివర్స్' అనౌన్స్‌మెంట్.. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తో లింక్... మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్!
అంతేకాకుండా, ఇది పక్కా పాన్-ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుందనే సమాచారం . అయితే దీని మేకింగ్ స్కేల్ పై మరింత స్పష్టత రావాల్సి ఉంది. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, కిచ్చా సుదీప్ కటౌట్‌ను ఏ దర్శకుడు తెరపై ఎలా ఆవిష్కరించబోతున్నారో తెలియాలంటే మేకర్స్ రివీల్ చేసే తదుపరి అప్‌డేట్ వరకు వేచి చూడాల్సిందే.
