వావ్ అనిపించే సైన్స్‌‌ ఫిక్షన్‌‌ థ్రిల్లర్‌‌‌‌ కిల్లర్‌‌‌‌ సినిమా

వావ్ అనిపించే సైన్స్‌‌ ఫిక్షన్‌‌ థ్రిల్లర్‌‌‌‌ కిల్లర్‌‌‌‌ సినిమా

జ్యోతి పూర్వజ్, పూర్వజ్ లీడ్ రోల్స్‌‌లో నటిస్తున్న చిత్రం ‘కిల్లర్‌‌‌‌’. పూర్వజ్ దర్శకత్వం వహించడంతో పాటు ఎ.పద్మనాభ రెడ్డితో కలిసి నిర్మిస్తున్నారు. ఈనెల 30న విడుదల కానుంది.  బుధవారం ట్రైలర్‌‌‌‌ లాంచ్‌‌ ఈవెంట్ నిర్వహించారు.  ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు  హరీశ్ శంకర్ మాట్లాడుతూ ‘ ట్రైలర్‌‌‌‌తోనే సినిమా క్వాలిటీ ఎంత బాగుందో తెలిసిపోతోంది. ఈ మధ్య ఎలాన్ మస్క్ న్యూరో లింక్ పై పరిశోధనలు చేయిస్తున్నారు.

ఈ న్యూరో లింక్ సూపర్ షీని కలిస్తే ఎలా ఉంటుంది అనేది ఇందులో చూపించారు. దర్శకుడు పూర్వజ్‌‌ లిమిటెడ్ బడ్జెట్‌‌లో మంచి క్వాలిటీ సినిమా చేశారు’ అని చెప్పారు.  హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ ‘అంతర్జాతీయ స్థాయి సైన్స్‌‌ ఫిక్షన్ కంటెంట్‌‌తో కొత్త తరహా స్క్రీన్‌‌ప్లేతో వస్తున్న సినిమా ఇది. పూర్వజ్ విజన్ వైవిధ్యంగా ఉంటుంది. ప్రేక్షకులు మా సినిమా చూస్తున్నప్పుడు వావ్ అనుకుంటారు’ అని చెప్పారు.  డైరెక్టర్ పూర్వజ్ మాట్లాడుతూ ‘టీజర్‌‌‌‌, ట్రైలర్‌‌‌‌తో మూవీ కంటెంట్‌‌ అర్థమైనట్లే అనిపించినా డీప్‌‌గా ఒక అందమైన కథ ఇందులో ఉంది.  

మీరు ఇలాంటి సినిమా ఇప్పటిదాకా చూడలేదు అని కాన్ఫిడెంట్​గా చెబుతున్నా. ప్రేక్షకుల గుండెల్లో దాచిపెట్టుకునే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఇది చూసి మీరు థ్రిల్ ఫీల్ అవుతారు, ఎగ్జైట్ అవుతారు’ అని చెప్పాడు. నిర్మాత పద్మనాభరెడ్డి.ఎ, నటులు  చందు, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి, డీవోపీ జగదీశ్ బొమ్మిశెట్టి, ఎడిటర్ బి.మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.