సీఎం విజయ్‌ చేతికి కోహ్లీ సైన్ చేసిన స్పెషల్ బ్యాట్... నెట్టింట పిక్స్ వైరల్ !

 సీఎం విజయ్‌ చేతికి కోహ్లీ సైన్ చేసిన స్పెషల్ బ్యాట్... నెట్టింట పిక్స్ వైరల్ !

తమిళనాట ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు... 'దళపతి' నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన సీ జెడిఎఫ్ విజయ్ (C Joseph Vijay). తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీని స్థాపించి, సరికొత్త రాజకీయ సంచలనంగా మారారు. పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. విజయ్.. సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయనకు కానుకల వెల్లువ కురుస్తోంది. లేటెస్ట్ గా ఆయన అందుకున్న 'క్రేజీ' గిఫ్ట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. 

క్రికెట్ ప్రపంచంలో 'రన్ మెషీన్' గా గుర్తింపు తెచ్చుకున్కన విరాట్ కోహ్లీ క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే శుక్రవారం ( మే 22న ) సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్‌ను ప్రముఖ టైర్ల తయారీ సంస్థ MRF ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలో కంపెనీ కార్యకలాపాలపై చర్చించేందుకు వచ్చిన వారు విజయ్‌కు ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. విరాట్ కోహ్లీ స్వయంగా సంతకం చేసిన ఒక స్పెషల్ క్రికెట్ బ్యాట్‌ను ఆయనకు బహుమతిగా అందించారు.  ఆ బ్యాట్‌ను చేతిలోకి తీసుకుని చిరునవ్వుతో ఫొటోలకు విజయ్ ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

 

దర్శకుడు స్పెషల్ గిఫ్ట్..

ఇక అంతకుముందు, స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఇచ్చిన గిఫ్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. 2024లో విజయ్ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (The GOAT) గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో వాడిన ఒక కార్ నంబర్ ప్లేట్ 'TN 07 CM 2026' అని ఉంటుంది. అంటే, 2026లో విజయ్ సీఎం అవుతారని వెంకట్ ప్రభు అప్పుడే జోస్యం చెప్పారన్నమాట. ఇప్పుడు అదే నిజం కావడంతో, ఆ నంబర్ ప్లేట్‌ను ఒక అందమైన ఫ్రేమ్‌గా మార్చి విజయ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. 

 

'జననాయగన్' రిలీజ్ ఎప్పుడంటే?

పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ముందు విజయ్ సైన్ చేసిన చివరి ప్రాజెక్ట్ 'జననాయగన్' . H. వినోద్ దర్శకత్వంలో మమితా బైజు, బాబీ డియోల్, పూజా హెగ్డే నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ జనవరిలోనే రిలీజ్ కావాల్సింది. కానీ, సెన్సార్ బోర్డ్ (CBFC) వివాదాలు, కోర్టు కేసుల వల్ల సినిమా ఇంకా రివైజింగ్ కమిటీ దగ్గరే ఆగిపోయింది. దీనికి తోడు, ఏప్రిల్‌లో ఈ సినిమా హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం పెద్ద దుమారం రేపింది . సినిమా లీక్ అయినా.. థియేటర్లలో ఈ 'జననాయగన్' చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నారు.