సైకలాజికల్ థ్రిల్లర్ 'హతః' గ్లింప్స్ రిలీజ్.. ప్రొడ్యూసర్‌గా కిరణ్ అబ్బవరం మరో ప్రాజెక్ట్!

 సైకలాజికల్ థ్రిల్లర్ 'హతః' గ్లింప్స్ రిలీజ్..  ప్రొడ్యూసర్‌గా కిరణ్ అబ్బవరం మరో ప్రాజెక్ట్!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం అంటేనే ప్రయోగాలకు మారుపేరు. ఇటీవల్ వచ్చిన 'చెన్నై లవ్ స్టోరీ' హిట్ తో  ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ కుర్ర హీరో కంటెంట్ ఉన్న సినిమాలను ప్రోత్సహిస్తూ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గానూ దూసుకెళ్తున్నారు. దాదాపు 50 మంది కొత్త నటీనటులతో 'తిమ్మరాజుపల్లి టీవీ' నిర్మించి ఔరా అనిపించారు. అయితే  ఇప్పుడు తన సొంత బ్యానర్ కిరణ్ అబ్బవరం & పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ లో ప్రాజెక్ట్ నంబర్-2 ను ఎనౌన్స్ చేసి ఒక్కసారిగా టాలీవుడ్ దృష్టిని ఆకర్షించారు.

టైటిల్ గ్లింప్స్‌తోనే..

'హతః' మూవీ టైటిల్ ఎనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌తోనే ప్రేక్షకుల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు మేకర్స్. చీకటి వాతావరణం.. సీటు చివర కూర్చోబెట్టే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. నెమ్మదిగా ఒక డార్క్ బాక్స్ వైపు జూమ్ అయ్యే కెమెరా.. అందులో ఓ మిస్టరీ పిల్లి! ఆ వెంటనే ఈ పిల్లి బతికి ఉందా.. లేక చనిపోయిందా? ( "Is the cat alive or.."  ) అంటూ వదిలిన క్యాప్షన్ అండ్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. క్వాంటమ్ ఫిజిక్స్‌లోని ప్రసిద్ధ శ్రోడింగర్ క్యాట్ థియరీని పోలి ఉన్న ఈ పాయింట్, సైకలాజికల్ థ్రిల్లర్ ప్రియులకు పూనకాలు తెప్పిస్తోంది.

సాధారణ కమర్షియల్ ఫార్మాట్‌కు పూర్తి భిన్నంగా, టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎవరూ చూడని ఒక మైండ్ బెండింగ్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు అనుష్ గోరాక్ దర్శకత్వం వహించడమే కాకుండా, తన కెమెరా మ్యాజిక్‌తో సినిమాటోగ్రఫీ బాధ్యతలను కూడా స్వయంగా భుజాన వేసుకున్నారు.

సైకలాజికల్ థ్రిల్లర్..

ఈ'హతః' మూవీలో కుష్లు మద్దాల, రెహ్మాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టస్వామి కీలక పాత్రలో నటిస్తున్నారు.  జెసిన్ జార్జ్ సంగీతం అందిస్తున్నారు. అసలు ఆ డార్క్ బాక్స్‌లో ఉన్న రహస్యం ఏంటి? పిల్లి మిస్టరీ వెనుక ఉన్న అసలు కథేంటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్!త్వరలోనే టీజర్ రిలీజ్ చేసి అసలు ఊచకోత మొదలుపెడతామని మేకర్స్ స్పష్టం చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి..