హీరోగా, నిర్మాతగా ప్రూవ్ చేసుకున్న కిరణ్ అబ్బవరం.. తాజాగా దర్శకుడిగా కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం కిరణ్ హీరోగా నటిస్తూ ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. సెకండ్ షెడ్యూల్ చిత్రీకరిస్తున్నారు. దాదాపు 40 శాతం షూట్ కంప్లీట్ కాగా, ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. కిరణ్ నటించిన ‘క’ మూవీ దివాళీకి వచ్చి సక్సెస్ సాధించడంతో అదే సెంటిమెంట్‌తో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. తను హీరోగా నటిస్తున్న 13వ చిత్రమిది. ‘రియాల్టీ’ (Reality) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. త్వరలోనే టైటిల్ రివీల్ చేయనున్నారు.
Actor-Director #KiranAbbavaram’s #Reality shooting on full swing.
— Star Talkies (@startalkies_ofl) August 22, 2026
Diwali Release Confirmed pic.twitter.com/GdDybDy4On
దేవికా భట్ హీరోయిన్‌గా పరిచయం అవుతుండగా, సీనియర్ నటులు శరత్ కుమార్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులను మెప్పించే ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు.
Thank you Team ❤️#JoyFilms #KA13 pic.twitter.com/AUFkPCqAWi
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) July 15, 2026
