కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘రియాలిటీ’. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇందులో హీరోయిన్గా నటిస్తున్న దేవికా భట్ పాత్రను పరిచయం చేశారు.
ఈ చిత్రంలో ఆమె ‘ఆలోచన’ అనే పాత్రలో కనిపించనుందని రివీల్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ నేచురల్ లుక్‌లో ఇంప్రెస్ చేశారు. ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ చిత్రంలో శరత్ కుమార్, సాయి కుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుదర్శన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సురేష్ యెర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
