పలు చిత్రాలతో హీరోగా ప్రూవ్ చేసుకున్న కిరణ్ అబ్బవరం, రీసెంట్‌గా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమాతో నిర్మాతగానూ మారాడు. ఇప్పుడు దర్శకుడిగా కూడా సత్తా చాటాలనుకుంటున్నాడు. కిరణ్ హీరోగా నటిస్తూ దర్శక నిర్మాతగా ‘రియాలిటీ’ టైటిల్‌తో ఓ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
నిజ జీవితంలో తను చూసిన పాత్రలు, సంఘటనల ఆధారంగానే కథను సిద్ధం చేశాడట. ప్రస్తుతం ప్రీ- ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకోవడంతో ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు సినిమాల్లోకి రాకముందే పలు షార్ట్ ఫిలిమ్స్ రూపొందించిన అనుభవం కిరణ్‌కు ఉంది. కథ, స్క్రీన్‌ప్లే, మేకింగ్ అంశాలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఇప్పటివరకు తాను నటించిన చిత్రాల మేకింగ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కిరణ్.. ఇప్పుడు పూర్తిస్థాయి దర్శకుడిగా తన విజన్‌ను తెరపై చూపించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు.
