ఆసిఫాబాద్లో ఆకట్టుకున్న కిసాన్మేళా.. ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన

ఆసిఫాబాద్లో ఆకట్టుకున్న కిసాన్మేళా.. ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన
  •     ఎల్​నినో పరిస్థితులకు అనుగుణంగా  పంటలు వేయాలని సూచనలు 

మంచిర్యాల, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్స్​లో  వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కిసాన్ మేళా ఆకట్టుకుంది. ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్​బాబుతో కలిసి కలెక్టర్​ హరిత ప్రారంభించారు. మేళాలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ సంబంధిత స్టాళ్లను సందర్శించారు. 

విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయయంత్ర  పరికరాలు, ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం,  సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఎల్‌‌‌‌నినో ప్రభావం దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల సాగులో మార్పులు చేసుకోవాలని కలెక్టర్​ హరిత సూచించారు. నీటి లభ్యత, వర్షపాతం, నేల స్వభావం పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు.