
నరేష్ అగస్త్య(Naresh Agasthya), అభినవ్ గోమఠం(Abhinav Gomatam), విశ్వ దేవ్(Vishwa Dev) ప్రధాన పాత్రలు పోషించిన కామెడీ ఎంటర్టైననర్ కిస్మత్(Kismath). శ్రీనాథ్ బాదినేని(Srinath Badineni) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్ర పోషించాడు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజు నిర్మించారు. ఫిబ్రవరి 2న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
అభినవ్ గోమఠం మాట్లాడుతూ ‘ఇదొక క్రైమ్ కామెడీ సినిమా. చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. కచ్చితంగా అందరినీ అలరిస్తుంది’ అని చెప్పాడు. ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా అన్నాడు అవసరాల శ్రీనివాస్. ఇది కన్నుల పండగలా ఉండే సినిమా అని చెప్పాడు విశ్వదేవ్. డైరెక్టర్ శ్రీనాథ్ మాట్లాడుతూ ‘వినోదాత్మకమైన కథ ఇది. థియేటర్స్‌లో ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. నటులు తాగుబోతు రమేష్, రచ్చరవి, సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ పాల్గొన్నారు.