Vastu Tips: కిచెన్​లో వస్తువులు ఏ దిక్కులో ఉండాలి.. ఫ్లోర్​కు ఎన్ని డోర్లు.. కిటికీలు ఉండాలి..

Vastu Tips: కిచెన్​లో వస్తువులు ఏ దిక్కులో ఉండాలి..  ఫ్లోర్​కు ఎన్ని డోర్లు.. కిటికీలు ఉండాలి..

ప్రతి వారు సొంతిల్లు ఉండాలనుకుంటారు.  కొందరు తక్కువ ఖర్చుతో అపార్ట్​ మెంట్ కొనుక్కుంటే.. మరి కొందరు ఇండివిడ్యుయల్​ హౌస్​ కట్టుకుంటారు.  ఏది కొన్నా.. కట్టుకున్నా.. ఉన్న స్థలంలోనే సరిపెట్టుకోవాలి. ఇక కిచెన్​ రూం వాస్తుకువస్తే అది ఏదిక్కున ఉండాలి.. వంటగదిలో వస్తువులు ఏదిక్కులో ఉండాలి.. మెట్ల కింద బాత్రూం ఉండవచ్చా .. ఉండకూడదా...  ప్రతి ఫ్లోర్​ కు ఎన్ని తలుపులు.. ఎన్నికిటికీలు ఉండాలి.. ఈ విషయాలపై వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ ఏమంటున్నారో తెలుసుకుందాం..

ప్రశ్న: వంట గది ఎటువైపు కట్టుకోవాలి అనేదానికి వాస్తు ఉంటుంది. కానీ.. అందులో వస్తువులు ఈ దిక్కులో మాత్రమే పెట్టుకోవాలి? ఫలానా వస్తువులు ఫలానా దిక్కులో పెట్టుకోవాలి. అని ఏమైనా నియమాలు ఉంటాయా? 

జవాబు: వంటగదిలో వస్తువులన్నీ పడమర, దక్షిణ దిశల్లో పెట్టుకుంటే మంచిది. ఫలానా వస్తువు ఫలానా దిక్కు పెట్టుకోవాలి అని రూల్ ఏం లేదు. 

ప్రశ్న: మేం రెండంతస్తుల ఇల్లు కడుతున్నాం. రెండు అంతస్తుల్లో కలిపి ఎనిమిది డోర్లు పెట్టాలనేది మా ఆలోచన.కింది అంతస్తులో ఐదు పెట్టించుకుని, పై అంతస్తులో మూడు పెట్టుకుంటే సరిపోతుందా? లేదంటే.. ప్రతి అంతస్తులో సరి సంఖ్యలోనే ఉండాలా? 

జవాబు : ఏ ఫ్లోర్ లెక్క ఆ ఫ్లోర్​ కే  ఉంటుంది. ఒక ఫ్లోర్​ కు  ఎనిమిది డోర్లు నాలుగు, విండోలు లేదా ఎనిమిది డోర్లు ఎనిమిది విండోలు... ఇలా సరి సంఖ్యలో ఉండేట్టు చూసుకోవాలి


ప్రశ్న: ఇప్పుడు చాలామంది మెట్ల కింద బాత్రూంలు కడుతున్నారు. అలా కట్టుకోవడం వల్ల ఏమైనా వాస్తు సమస్యలు వస్తాయా? 

జవాబు: ఇది చాలామందికి ఎదురయ్యే సమస్యే. తక్కువ స్థలంలో ఉన్నవాళ్లు అందరూ ఇలాగే కట్టుకుంటున్నారు. కానీ.. అలా కట్టుకోవడం మంచిది కాదు. వాయువ్యం, ఆగ్నేయంలో మెట్లు ఉంటే.. వాటి కింద కట్టుకోవచ్చు. అది కూడా ఉత్తరం వైపు ఉన్న గోడకు తగలకుండా కట్టుకోవాలి. నైరుతిలో మెట్లు ఉంటే స్టోర్ రూం కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మిగతా ఏ దిక్కుల్లో మెట్లు ఉన్నా కట్టుకోవద్దు

-–వెలుగు,లైఫ్​–