KKR vs LSG: టాస్ గెలిచిన కోల్‌కతా.. షమర్ జోసెఫ్‌ అరంగ్రేటం

KKR vs LSG: టాస్ గెలిచిన కోల్‌కతా.. షమర్ జోసెఫ్‌ అరంగ్రేటం

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు(ఏప్రిల్ 14) డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ తపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా సారథి శ్రేయాస్ అయ్యర్.. లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. 

తుది జట్లు

కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా,  హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని,  కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, అర్షద్ ఖాన్, షమర్ జోసెఫ్, మొహ్సిన్ ఖాన్, యష్ ఠాకూర్.