KL Rahul Leave Delhi Capitals: ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ముందే ట్రేడింగ్ ఇష్యూ హాట్ టాఫిక్ గా మారింది. గత రెండు సీజన్లుగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరఫున ఆడిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant).. మళ్లీ తన పాత టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తరపున బరిలోకి దిగేందుకు సర్వం సిద్ధమైంది. ఈ మెగా ట్రేడ్‌లో భాగంగా ఢిల్లీ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) లక్నో జట్టులోకి వెళ్లనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ డీల్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇప్పటికే బీసీసీఐ (BCCI) ఆమోదం కోసం వెళ్లినట్లు తెలుస్తుంది.
పంత్ వస్తే.. కేఎల్ రాహుల్ వేలానికి వెళ్లాల్సిందే:
ఢిల్లీ టీమ్‌లోకి రిషభ్ పంత్ తిరిగి వస్తుండటంతో.. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul) ఫ్యూచర్ ఏంటనే దానిపై పెద్ద చర్చ నడుస్తోంది. దీనిపై టీమిండియా మాజీ పేసర్ దొడ్డ గణేష్ సోషల్ మీడియా (X) లో క్రేజీ కామెంట్ చేశాడు. ఒకవేళ పంత్ గనుక ఢిల్లీ జట్టులోకి తిరిగి వస్తే.. కేఎల్ రాహుల్ తనను రిలీజ్ చేయమని అడిగి, డైరెక్ట్‌గా ఐపీఎల్ వేలానికి (Auction) వెళ్లడం ఉత్తమం అని సూచించాడు. గత ఐపీఎల్ 2026 లో వీరిద్దరి పర్ఫామెన్స్ చూస్తే చాలా డిఫరెంట్‌గా ఉంది.. లక్నో జట్టు రూ. 27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసిన పంత్.. గత సీజన్‌లో కేవలం 312 రన్స్ మాత్రమే చేసి కెప్టెన్సీలో కూడా విఫలమయ్యాడు. దీంతో లక్నో టేబుల్‌లో చివరి స్థానంలో నిలిచింది. కానీ, కేఎల్ రాహుల్ మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 14 మ్యాచ్‌ల్లో 174.41 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 593 రన్స్ (పంజాబ్‌పై 152 నాటౌట్) చేసి అదిరిపోయే ఫామ్‌లో ఉన్నాడు.
మెంటార్‌గా యువరాజ్ సింగ్:
ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ప్లేయర్లనే కాదు.. తమ సపోర్ట్ స్టాఫ్‌ను కూడా భారీగా మార్చబోతోంది. టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ఢిల్లీ సపోర్ట్ స్టాఫ్‌లో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పంత్ గత ఐపీఎల్‌కు ముందు యువీతో కలిసి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. వీరితో పాటు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మళ్లీ హెడ్ ఆఫ్ క్రికెట్ అఫైర్స్‌గా మేనేజ్‌మెంట్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. గత సీజన్‌లో ఢిల్లీ 6వ స్థానంలో నిలవడంతో ప్రస్తుతం ఉన్న హెడ్ కోచ్ హేమంగ్ బదాని భవిష్యత్తు సస్పెన్స్‌లో పడింది.
