ఘనంగా కేఎల్ రాహుల్ వివాహం

ఘనంగా కేఎల్ రాహుల్ వివాహం

టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి అతియా శెట్టిని వివాహం చేసుకున్నాడు. మహారాష్ట్రలోని ఖండాలాలోని సునీల్ శెట్టి బంగ్లాలో కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువులు, మిత్రుల సమక్షంలో  కేఎల్ రాహుల్, అతియా శెట్టి ఒక్కటయ్యారు.  కేఎల్ రాహుల్ పెళ్లికి..క్రికెటర్ ఇషాంత్ శర్మ, వరుణ్ ఆరోన్  హాజరయ్యారు. 

కుర్తా, సంప్రాదాయ నగలు ధరించి  కేఎల్ రాహుల్, అతియా శెట్టి వివాహవేడుకకు హాజరైన సునీల్ శెట్టి..వివాహం గురించి వెల్లడించాడు. తాను మామను అయ్యానంటూ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.  కేఎల్ రాహుల్ పెళ్లి ఘనంగా జరిగిందని చెప్పాడు.  ఐపీఎల్  తర్వాత రిసెప్షన్ ఉంటుందని తెలిపాడు. అటు సునీల్ కుమారుడు అహాన్ శెట్టి బయట మీడియా ప్రతినిధులకు స్వీట్లు పంచాడు.