ఆప్టన్‌‌‌‌ సపోర్ట్​తో అయినా రాహుల్‌‌‌‌ గాడిలో పడతాడా

ఆప్టన్‌‌‌‌ సపోర్ట్​తో అయినా రాహుల్‌‌‌‌ గాడిలో పడతాడా

పెర్త్‌‌‌‌ : ఓవైపు టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌‌‌‌లు గెలిచినా.. మరోవైపు ఓపెనర్‌‌‌‌ కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ ఫామ్‌‌‌‌పై ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. పాకిస్తాన్‌‌‌‌, నెదర్లాండ్స్‌‌‌‌పై తను సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌ స్కోరుకే ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో ఆదివారం జరిగే మ్యాచ్‌‌‌‌లో కేఎల్‌‌‌‌కు కఠిన పరీక్షగా మారనుంది. ఈ మ్యాచ్​ కోసం రాహుల్‌‌‌‌ స్పెషల్‌‌‌‌గా నెట్‌‌‌‌ సెషన్‌‌‌‌లో పాల్గొంటున్నాడు. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌‌‌‌ల్లో రాహుల్‌‌‌‌ ఎక్కువగా వికెట్ల ముందు దొరికిపోయే విధంగా బ్యాటింగ్‌‌‌‌ చేశాడు.

ఈ లోపాన్ని సరిదిద్దుకునేందుకు గంటల తరబడి నెట్స్‌‌‌‌లో ప్రాక్టీస్‌‌‌‌ చేస్తున్నాడు. అయితే మానసికంగా, టెక్నికల్‌‌‌‌గా కూడా దీనిని సరి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం మెంటల్‌‌‌‌ హెల్త్‌‌‌‌ కండీషనింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌ ప్యాడీ ఆప్టన్‌‌‌‌ సాయం తీసుకోవాలని డిసైడయ్యాడు.  రాబోయే రెండు రోజులు ఆప్టన్‌‌‌‌ సమక్షంలో గంటపాటు స్పెషల్‌‌‌‌ సెషన్స్‌‌‌‌లో పాల్గొంటాడని తెలుస్తోంది.  మరి ఆప్టన్‌‌‌‌ సపోర్ట్​తో అయినా రాహుల్‌‌‌‌ గాడిలో పడతాడేమో చూడాలి.