
న్యూఢిల్లీ: ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న రాహుల్‌ను విమర్శలతో ఒంటరిని చేయొద్దని టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ప్రతి ప్లేయర్ కెరీర్లో ఎత్తుపల్లాలు ఉంటాయన్నాడు. ‘టీమిండియా నుంచి రాహుల్‌ను తప్పించొద్దు. ఎవర్నీ టార్గెట్ చేసి మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరు ఫామ్ కోల్పోతారు. బాగా ఆడకపోతే టీమ్ నుంచి తప్పిస్తామని చెప్పడానికి ఇక్కడ ఎవరూ క్రికెట్ పండితులు కారు. రాహుల్ త్వరలోనే గాడిలో పడతాడు’ అని గౌతీ పేర్కొన్నాడు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ఇబ్బందులుపడ్డ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఓపెనర్‌గా మారిన తర్వాత ఫామ్‌లోకి రాలేదా? అంటూ గంభీర్ ఉదాహరణ చూపెట్టాడు. అందుకే టాలెంట్ ఉన్న ప్లేయర్లకు ఎప్పుడూ అండగా నిలవాలన్నాడు.