పెద్దపులి కలకలం

పెద్దపులి కలకలం

కొడంగల్, వెలుగు: కొడంగల్ పరిధి దౌల్తాబాద్ మండలంలో పెద్దపులి కలకలం రేపుతుంది.  మంగళవారం రాత్రి దౌల్తాబాద్ అడవి మార్గంలో వస్తున్న యువకులకు పెద్దపులి ఎదురుపడిందని స్థానిక పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేశారు.  ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అడవిలో గాలింపు చర్యలు మొదలెట్టారు.  చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.