ఫిలిం ఛాంబర్‌ కు కోడి రామకృష్ణ భౌతికకాయం

ఫిలిం ఛాంబర్‌ కు కోడి రామకృష్ణ భౌతికకాయం

హైదరాబాద్ : డైరెక్టర్ కోడి రామకృష్ణ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం జరగనున్నాయి. ఉదయం భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్‌ కు తరలించారు. అంతకుముందు ఆయన నివాసానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు కృష్ణం రాజు, సంగీత దర్శకుడు కోటి, జగపతిబాబు, కైకాల సత్యనారాయణ సహా పలువురు నివాళులర్పించారు. కోడి రామకృష్ణతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.