కేటీఆర్ భాష మార్చుకో.. నీ అహంకారంతోనే బీఆర్ఎస్ ఓడిపోయింది : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేటీఆర్ భాష మార్చుకో.. నీ అహంకారంతోనే  బీఆర్ఎస్ ఓడిపోయింది : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సీఎంరేవంత్ రెడ్డి.. కేసీఆర్ కాలు గోటికి కూడా సరిపోడంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన కామెంట్స్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైరయ్యారు. కాలి గోటికి సరిపోనివాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ కు పంపించాడని అన్నారు.   యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలంలోని మహాదేవపూర్ లో  వేణుగోపాలస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి ..  రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మూడవరోజే మూసి ప్రక్షాళన గురించి మాట్లాడారని..   మీరెప్పుడైనా దాని గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు.  

కేటీఆర్  బాషా మార్చుకోవాలని,  ముఖ్యమంత్రిని గౌరవించడం నేర్చుకోవాలని మంత్రి  కోమటిరెడ్డి హితవు పలికారు.  రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ జెడ్పీటీసీ నుంచి సీఎం అయిన వ్యక్తి అని..  నువ్వు కేసీఆర్ పేరుతో దొంగ మాటలు చెప్పి ఎమ్మెల్యే అయ్యావని విమర్శించారు.  రేవంత్ రెడ్డి చిటికెనా వేలుకు కూడా సరిపోవంటూ కేటీఆర్ పై ధ్వజమెత్తారు.  కేటీఆర్ అహంకారంతోనే నల్లగొండ జిల్లాలో వేల ఓట్లు మెజార్టీతో ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ చెప్పింది అంటే చేసే చూపిస్తుందని తెలిపారు.