ఏ.. కేటీఆర్ ఆగవయ్యా ఆగు.. మీ దుకాణం బందైపోయింది: కోమటిరెడ్డి

ఏ.. కేటీఆర్ ఆగవయ్యా ఆగు.. మీ దుకాణం బందైపోయింది: కోమటిరెడ్డి

బీఆర్ఎస్ వాళ్లను దేవుడు కూడా కాపాడలేడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  అన్నారు. అసెంబ్లీలో మాాట్లాడిన కోమటిరెడ్డి..  బీఆర్ఎస్ ప్రతిపక్షం కాదు.. ప్రస్టేషన్ పక్షమని మండిపడ్డారు. హరీశ్ రావు, కేటీఆర్ ప్రస్టేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  దోచుకున్న డబ్బుతో నల్గొండలో మీటింగ్ పెట్టారని ఆరోపించారు. నల్గొండలో బీఆర్ఎస్ ను చీదరించుకున్నారని చెప్పారు.

బీఆర్ఎస్  ర్యాలీలో ఓ హోంగార్డు చనిపోతే పట్టించుకోలేదని అన్నారు. కేసీఆర్   దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిండు. కేసీఆర్ చెప్పినట్లు దళితుడిని ముఖ్యమంత్రిని చేశారా? అని ప్రశ్నించారు కోమటిరెడ్డి.  2014లో దళిత బిడ్డ భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేత అయితే  కేసీఆరే పార్టీని చీల్చారని చెప్పారు.  బీఆర్ఎస్ అబద్దాల పార్టీ కాబట్టే దుకాణం బంద్ అయిపోయిందని ధ్వజమెత్తారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతుండగా..కేటీఆర్ మధ్యలో అభ్యంతరం చెప్పారు. కేటీఆర్ ఆగవయ్యా ఆగు.. మీ దుకాణం బంద్ అయిపోయిందంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేటీఆర్  పై మండిపడ్డారు.

ఎవరిది ప్రస్టేషన్ పార్టీనో మాటలు చూస్తే అర్థమవుతుందని కడియం శ్రీహరి కోమటిరెడ్డికి కౌంటర్ వేశారు. ఒక మంత్రి సభలో మాట్లాడే భాషను మార్చుకోవాలని సూచించారు.  సీఎం రేవంత్ రెడ్డిది..నాది ఒకటే స్కూల్ ..నేను సీనియర్ స్టూడెంట్ ని..ఆయన జూనియర్ స్టూడెంట్.. రేవంత్ సీఎం అయితే నాకేం అభ్యంతరం లేదు కానీ..కాంగ్రెస్ సభ్యులను అదుపులో పెట్టుకోవాలని సూచించారు.