అసెంబ్లీలో హరీశ్ రావు VS కోమటిరెడ్డి ..

అసెంబ్లీలో హరీశ్ రావు  VS కోమటిరెడ్డి ..

అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య  మధ్య మాటల యుద్దం జరిగింది.  నల్గొండ సభకు హెలికాప్టర్లో  వెళ్లిన కేసీఆర్.. పక్కనున్న అసెంబ్లీకి కార్లో రాలేరా.? సీఎంపై కేసీఆర్ వాడిన భాష సరిగా ఉందా? అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాపాల బైరవుడు.. మోహం లేకనే అసెంబ్లీకి రావడం లేదన్నారు. నల్గొండను కేసీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు. 

కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. మంత్రిగా ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం పద్దతి కాదన్నారు.  కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.