బర్తరఫ్ తర్వాత కొండా సురేఖ ఫస్ట్ రియాక్షన్ ఇదే

బర్తరఫ్ తర్వాత కొండా సురేఖ ఫస్ట్ రియాక్షన్ ఇదే

మంత్రి వర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ స్పందించారు. వివరణ తీసుకోకుండా.. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా తనను అలా ఎలా బర్తరఫ్ చేస్తారని కొండా సురేఖ ప్రశ్నించారు. తన బర్తరఫ్ చెల్లదని ఆమె వాదించారు. తన కూతురు సుస్మిత వాఖ్యలకు తనను ఎలా బాధ్యురాలిని చేస్తారని ఆమె నిలదీశారు.

దాదాపు పదేళ్లుగా తన కూతురు టికెట్ కోసం ప్రయత్నం చేస్తుందని.. కడియం తన కూతురిని ఎంపిక చేసుకోలేదా అని ఆమె ప్రశ్నించారు. అలాంటప్పుడు సుస్మిత టికెట్ అడిగితే తప్పేంటని కొండా సురేఖ తన వైఖరిని స్పష్టం చేశారు. డీఎస్ ఇంట్లో రెండు పార్టీలు ఉన్నాయని.. అర్వింద్ బీజేపీలో ఉన్నారని ఆమె చెప్పారు.

కొండా సురేఖ రియాక్షన్ హైలైట్ పాయింట్స్:
* కూతురు చేసిన వ్యాఖ్యలకు నాకేం సంబంధం 
* నా మీద అవినీతి ఆరోపణలు కూడా లేవు
* నా కూతురు వ్యాఖ్యల కారణంగా నన్ను బ్లేమ్ చేయడం సరికాదు
* సీఎం రేవంత్ రెడ్డి.. వరంగల్ పర్యటనలో కొండా మురళీకి జిల్లా బాధ్యతలు అప్పజెప్తానని చెప్పారు
* మురళి సంగతి ఏంటని ఎన్నిసార్లు అడిగినా సీఎం  దాట వేశారు.
* నేను మహిళను.. బీసీని.. నన్ను తప్పించడం పార్టీకి నష్టం