రేవంత్ నామినేషన్ కు కోనాపూర్ గ్రామస్తుల విరాళం

రేవంత్ నామినేషన్ కు కోనాపూర్ గ్రామస్తుల విరాళం

కామారెడ్డి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నామినేషన్ కోసం కేసీఆర్ తల్లి స్వగ్రామం కోనాపూర్ వాసులు విరాళంగా నామినేషన్ డబ్బులను అందించారు. ఇవాళ కామారెడ్డికి చేరుకున్న రేవంత్ ను  కలిసిన గ్రామస్తులు ఆ మొత్తాన్ని అందించారు.  సీఎం కేసీఆర్ ను గద్దె దించేందుకే తాము విరాళం అందిస్తున్నట్టు చెప్పారు. పదేండ్లుగా తమ గ్రామం కేసీఆర్ కు గుర్తుకు రాలేదా..? అని వారు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటామని చెప్పారు.