హీరోయిన్ ఆనంది ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. బుర్రకథలు చెప్పడమే కాదు, ఓ ఉద్యమంగా మార్చిన జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా ద్వారా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంగళవారం మరో జానపద గేయం ‘కోసింది కోయగూర’ను రిలీజ్ చేశారు.
చరణ్ అర్జున్ కంపోజ్ చేసిన ఈ పాటకు దర్శకుడు గౌరీ నాయుడు అడిషనల్ లిరిక్స్‌ను అందించగా, అనన్య భట్, షకలక శంకర్, గౌరీ నాయుడు పాడిన తీరు వైబ్‌ని యాడ్ చేశాయి. ‘కోసింది కోయగూర దుబ్బొ సందమావ, వాసనకి సంపంగి మొగ్గ.. యేళ్ల నిండా ఉంగరాలాయ్ సందమావ, ఉండదో ఈమె మనసు..’ అంటూ సాగిన పాటలో ఆనంది ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేసింది. ఆమెతోపాటు రాగ్ మయూర్ డ్యాన్స్ మూమెంట్స్ జోష్‌ని తీసుకొచ్చింది. ఈ చిత్రంలో నరేష్, రాశి, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
