కోట బొమ్మాళి పీఎస్ ఓటీటీ రిలీజ్‍ డేట్..అప్డేట్ ఇచ్చిన ఆహా

కోట బొమ్మాళి పీఎస్ ఓటీటీ రిలీజ్‍ డేట్..అప్డేట్ ఇచ్చిన ఆహా

హీరో శ్రీకాంత్ (Srikanth) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్ (Kota Bommali PS).ఈ సినిమా విడుదలకు ముందే ‘లింగి లింగి లింగిడి’ అనే సాంగ్తో సోషల్ మీడియాలో సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఈ పాటకు ప్రతి ప్రేక్షకుడు థియేటర్లోనూ..ఫంక్షన్స్ లోను స్టెప్పులేశారు. దీంతో ఈ సినిమా థియేటర్లో రిలీజై గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. 

లేటెస్ట్గా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్(Aha Platform) యాజమాన్యం కోట బొమ్మాళి పీఎస్ OTT స్ట్రీమింగ్ అప్డేట్ ఇచ్చారు. 'పందెం మొదలైంది..గెలిచేది ఎవరో చుడండి'.. పండుగకి ఒకరోజు ముందే..జనవరి 11న వస్తున్నాం..అంటూ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ఓటీటీ లవర్స్ కి పండుగ ముందుగానే షురూ కానుందన్నమాట. ప్రస్తుతం ఉన్న సిస్టమ్‌‌‌‌లో పొలిటీషియన్స్ చేతిలో..పోలీసులు ఎలా నలిగిపోతున్నారనే కథాంశంతో కోట బొమ్మాళీ మూవీ తెరకెక్కింది.

 

తేజా మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. మలయాళీ సూపర్ హిట్ ‘నాయాట్టు’ రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ 2 సంస్థ నిర్మించింది. నవంబర్ 24 న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.