కృష్ణ భారత బర్బరీకుడు మూవీ షూటింగ్ ప్రారంభం

 కృష్ణ భారత బర్బరీకుడు మూవీ షూటింగ్ ప్రారంభం

ఫైట్ మాస్టర్స్‌‌‌‌ రామ్ లక్ష్మణ్‌‌‌‌ల శిష్యుడు కృష్ణ భారత హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బర్బరీకుడు: ది సన్నాఫ్‌‌‌‌ ఘటోత్కచ’. శివ శక్తి దత్త శిష్యుడు శివఝాన్సి రేగాల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  టి. మల్లేశ్వరుడు, అంతటి నరేష్ కుమార్, అంతటి రాజేష్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. కురుక్షేత్ర యుద్ధంలోని బర్బరీకుడి కథతో దీన్ని తెరకెక్కిస్తున్నారు.

 రవిశంకర్‌‌‌‌‌‌‌‌ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సమ్మెట గాంధీ, జబర్దస్త్ చిట్టిబాబు, ఆనంద్ భారతి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  శ్యామ్ కే నాయుడు డీవోపీగా వర్క్ చేస్తుండగా జీఎం సతీష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంతో బర్బరీకుడు ఎంతటి గొప్పయోధుడో అందరికీ తెలుస్తుందని, కచ్చితంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందని 
దర్శకనిర్మాతలు తెలియజేశారు.