బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో కృష్ణంభజే

బ్రహ్మాజీ  ప్రధాన పాత్రలో కృష్ణంభజే

నటుడు బ్రహ్మాజీ  ప్రధాన పాత్రలో నాగరాజ్ కొట్టే రూపొందిస్తున్న చిత్రం ‘కృష్ణంభజే’.  కలాల్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శుక్రవారం కృష్ణాష్టమి సందర్భంగా ఈ మూవీ టైటిల్‌‌ను రివీల్ చేయడంతోపాటు బ్రహ్మాజీ పాత్రను పరిచయం చేశారు. ఇందులో ఆయన మార్కండేయ పాత్ర పోషిస్తున్నట్టు రివీల్ చేశారు.

ఈ పోస్టర్‌‌‌‌లోని  బ్రహ్మాజీ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.  పౌరాణిక, భక్తిరస అంశాల కలయికతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు.  ప్రదీష్, వంగమయి పటేల్ జంటగా నటిస్తుండగా,  మురళీ గౌడ్, రచ్చ రవి, అభయ్ బెతిగంటి, గౌతమ్ రాజు, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు  కీల‌‌క‌‌ పాత్రలు పోషిస్తున్నారు.