చిల్లర నా కొ.. బూతులతో రెచ్చిపోయిన KTR బూతులు

చిల్లర నా కొ.. బూతులతో రెచ్చిపోయిన KTR బూతులు

బీఆర్ఎస్ పార్టీ నేతలు అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. నోటికి ఎంత వస్తే అంత మాటలు అంటున్నారు. నిన్నటికి నిన్న అసెంబ్లీ ఎదుట పోలీసులపై దౌర్జన్యం, బూతు మాటలతో రెచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీ నేతలు.. రెండో రోజు అదే స్థాయిలో పోలీసులపై విరుచుకుపడుతున్నారు. 

ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ దగ్గర కాంగ్రెస్ పార్టీ డబ్బు చప్పులకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ఎర్రవల్లి ఫాంహౌస్ కు బయలుదేరారు మాజీ మంత్రి కేటీఆర్. అక్కడ భద్రతకు సంబంధించి సమస్యలు వస్తాయని.. ఉద్రిక్తతలు తలెత్తుతాయనే కారణంగా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని.. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని వెనక్కి వెళ్లాలని సూచించారు పోలీసులు. ఈ క్రమంలోనే పోలీసులతో మాట్లాడుతూ.. కేటీఆర్ రెచ్చిపోయారు. చిల్లర నా కొ.. అంటూ పదే పదే వ్యాఖ్యానిస్తూ.. పోలీసులను, సీఎం రేవంత్ రెడ్డిని దూషించారు కేటీఆర్. 

శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని చెప్పినా కేటీఆర్ తన ధోరణిలో తానే.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ రెచ్చిపోయారు. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా.. కారు దిగి.. నడుచుకుంటూ ఎర్రవల్లి ఫాంహౌస్ వైపు నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేసింది.