తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని 11 రోజులు అన్నం తినలేదని చెప్పావ్.. అంటే తెలంగాణ ఏర్పాటు కావటం ఇష్టం లేదని నువ్వే చెప్పావ్ కదా.. ముందు ఆ విషయంపై క్లారిటీ ఇవ్వు అంటూ డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్.
దేశభక్తి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అని.. తెలంగాణ ప్రజలకు.. తెలంగాణ సమాజానికి దేశ భక్తి గురించి పవన్ కల్యాణ్ దగ్గర పాఠాలు చెప్పించుకోవాల్సిన దిక్కుమాలిన పరిస్థితి లేదని స్పష్టం చేశారు కేటీఆర్. తెలంగాణ ప్రజలకు పోరాటాలు తెలుసు.. యుద్ధాలూ తెలుసు.. తెలంగాణకు మీకంటే ఎక్కువ దేశ భక్తి ఉందంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్.
ఓ బ్రదర్ గా ఇంటికొస్తే బిర్యానీ పెడతాం తినిపో.. అంతేకానీ తెలంగాణ సెక్రటేరియట్ లో కూర్చుని పెత్తనం చేస్తాం అంటే మాత్రం ఊరుకోం అంటూ చురకలు అంటించారు కేటీఆర్.పవన్ కల్యాణ్ OG సినిమా డైలాగ్స్ చెబుతున్నాడని.. తెలంగాణ ఓజీ కేసీఆర్ అని.. సినిమా డైలాగ్స్ వేరు పరిపాలన వేరు అంటూ స్పష్టం చేశారు కేటీఆర్.
