ఏఐని భూతంలా చూడొద్దు..స్కిల్స్ నేర్చుకొని అప్ డేట్ అవ్వాలి: కేటీఆర్

ఏఐని భూతంలా చూడొద్దు..స్కిల్స్ నేర్చుకొని అప్ డేట్ అవ్వాలి: కేటీఆర్
  • ఏఐతో జాబ్స్​ పోవు.. కొత్త అవకాశాలు వస్తాయి
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గ్లోబల్ ఏఐ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దాలి 
  • ర్యాండమ్ ట్రీస్ సంస్థ హెడ్ క్వార్టర్స్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఏఐ)ను భూతంలా చూపిస్తూ యువతలో భయాందోళనలు సృష్టించడం సరికాదని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యోగాలు పోతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటే అంతకుమించిన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని చెప్పారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అంతర్జాతీయ స్థాయి ఏఐ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 
తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.  ప్రముఖ ఐటీ సంస్థ ‘ర్యాండమ్ ట్రీస్ ఇండియా’ హెడ్ క్వార్టర్స్​ను శనివారం కేటీఆర్​ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సాంకేతిక రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నదన్నారు. దీని వల్ల ఉపాధి దెబ్బతింటుందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పాత పద్ధతులకు స్వస్తి పలికి, కొత్త నైపుణ్యాలను ఒడిసిపట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయం, వైద్యం, విద్య వంటి ప్రజా జీవన రంగాల్లో ఏఐ అద్భుతమైన మార్పులు తీసుకొస్తున్నదని చెప్పారు. భవిష్యత్తు మొత్తం స్కిల్లింగ్, అప్‌‌స్కిల్లింగ్, రీస్కిల్లింగ్‌‌పైనే ఆధారపడి ఉందన్నారు.  

కంపెనీల్లో ప్రభుత్వాల జోక్యం వద్దు

యువతకు ఎక్కువ ఉద్యోగాలు రావాలంటే ప్రైవేట్ రంగాన్ని విస్తరించడం ఒక్కటే మార్గమని కేటీఆర్ చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు ఆటంకాలు సృష్టించకుండా, ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. ఇప్పటికే నడుస్తున్న పరిశ్రమలు, కొత్తగా వచ్చే సంస్థల రోజువారీ కార్యకలాపాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోతే చాలని ఆయన అభిప్రాయపడ్డారు. కంపెనీలకు నిరంతర నాణ్యమైన కరెంటు, అవసరమైన నీరు, రాకపోకలకు అనువైన మంచి రోడ్లు వంటి మౌలిక వసతులు కల్పిస్తే సరిపోతుందని, మిగతా పనులను ఆయా యాజమాన్యాలే చూసుకుంటాయని స్పష్టం చేశారు. గత పదేండ్లలో తెలంగాణ ఐటీ రంగం అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ఆ ప్రస్థానాన్ని మరింత ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. డేటా, ఏఐ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులకు హైదరాబాద్ ప్రధాన చిరునామాగా మారాలని ఆకాంక్షించారు.