
నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం నీటితో పరవళ్లు తొక్కుతోంది. రెండు రోజుల కిందటి వరకు నీరు లేక వెలవెలబోయిన ఈ వాటర్ ఫాల్.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలకళను సంతరించుకుంది. చుట్టూ ప్రకృతి అందాలతో జాలువారుతున్న జలపాతాన్ని చూసేందుకు పర్యాటకుల రాక మొదలైంది. - నేరడిగొండ, వెలుగు