సైన్స్‌‌ ఫిక్షన్‌‌ స్టోరీతో కుశాల్ రాజు తక్షక మూవీ

సైన్స్‌‌ ఫిక్షన్‌‌ స్టోరీతో కుశాల్ రాజు తక్షక మూవీ

కుశాల్ రాజు హీరోగా దర్శకుడు వశిష్ట మల్లిడి సోదరుడు కృష్ణ మల్లిడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘తక్షక’. డా. లతా రాజు నిర్మిస్తున్నారు. ఇదొక సైన్స్ ఫిక్షన్ డ్రామా. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను డైరెక్టర్ వి.వి.వినాయక్ లాంఛ్ చేశారు. హీరోగా పరిచయం అవుతున్న కుశాల్ రాజు, దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్న కృష్ణ మల్లిడి ఈ సినిమాతో సక్సెస్ సాధించాలని వినాయక్ విష్ చేశారు. 

మహాభారత కాలం నుంచి ఇప్పటివరకు వేల ఏళ్లుగా జరిగిన అద్భుతమైన విశేషాలతో, సరికొత్త సైన్స్ ఫిక్షన్,  మైథాలజీ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు నిర్మాత డా. లతా రాజు తెలియజేశారు.  డైరెక్టర్ కృష్ణ మల్లిడి మాట్లాడుతూ ‘మా సినిమా ఓపెనింగ్‌‌ వినాయక్ గారి చేతుల మీదుగా  జరిగింది. 

ఇప్పుడు ఫస్ట్ లుక్ కూడా ఆయనే లాంఛ్ చేయడం హ్యాపీ. ఇంత త్వరగా సినిమా పూర్తయి దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రావడం ఎగ్జైటింగ్‌‌గా ఉంది’ అని చెప్పాడు.  త్వరలోనే ట్రైలర్‌‌‌‌ రిలీజ్ చేస్తామని, అందరినీ ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని హీరో కుశాల్ రాజు చెప్పాడు.