లాసెట్, పీజీఎల్ సెట్​ షెడ్యూల్ విడుదల

లాసెట్, పీజీఎల్ సెట్​ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్, వెలుగు: ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే లాసెట్, పీజీఎల్​సెట్ షెడ్యూల్ విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్​లో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ఆర్​లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ షెడ్యూల్​ను విడుదల చేశారు. ఈ నెల 6 నుంచి జూన్ 6 వరకూ ఆన్​లైన్​లో అప్లికేషన్లు తీసుకుంటామని, రూ.500 ఫైన్​తో జూన్ 26 వరకు, రూ.వెయ్యి ఫైన్​తో జులై 5 వరకు, రూ.2 వేల ఫైన్​తో జులై 12 వరకు ఫీజు చెల్లించవచ్చాన్నారు. టీఎస్ లాసెట్​లో మూడేండ్ల ఎల్ఎల్బీ కోర్సు, ఐదేండ్ల ఎల్ఎల్బీ కోర్సు కోసం ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులు రూ.500, మిగిలిన విద్యార్థులు రూ.800 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎల్ఎల్ఎం కోర్సు కోసం పీజీఎల్​ సెట్ కు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.800, మిగిలిన వారికి రూ.వెయ్యి ఫీజుగా నిర్ణయించారు. జులై 21, 22 తేదీల్లో లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలుంటాయి.