లఫూట్‌‌ గ్యాంగ్‌‌ అల్లరి షురూ

లఫూట్‌‌ గ్యాంగ్‌‌ అల్లరి షురూ

రాఖి, రిత్విక్, అభినవ్, నందు, ఆంటోనీ కార్తిక్ ముఖ్యపాత్రల్లో అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘లఫూట్ గ్యాంగ్‌‌’. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్నాడు. బుధవారం రామానాయుడు స్టూడియోస్‌‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. 

ముహూర్తపు సన్నివేశానికి నటుడు అలీ గారు క్లాప్ కొట్టగా దర్శకుడు పవన్ సాధినేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నటులు రాజ్ తరుణ్, ఆకాష్ పూరి స్క్రిప్ట్‌‌ను మేకర్స్‌‌కు అందించారు. నటుడు రాహుల్ విజయ్, అర్చన అయ్యర్, నిర్మాతలు బివిఎస్ రవి, అనిల్ కడియాల అతిథులుగా హాజరయ్యారు.

 ‘‘నైంటీస్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఓ హాస్టల్‌లో జరిగిన  కథ ఇది.  హాస్టల్‌‌ లైఫ్‌‌లో యువకుల గ్యాంగ్‌‌ చేసే అల్లరి హిలేరియస్‌‌గా ఉంటుంది” అని దర్శకనిర్మాతలు తెలియజేశారు. మూవీ టీమ్ అంతా ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.