తెలంగాణ సెయిలింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌: టాప్‌‌ ప్లేస్‌‌లో లాహిరి, బన్నీ

తెలంగాణ సెయిలింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌: టాప్‌‌ ప్లేస్‌‌లో లాహిరి, బన్నీ

హైదరాబాద్‌‌: తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్‌‌ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర సెయిలింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో లాహిరి కొమరవెల్లి టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచింది. సబ్‌‌ జూనియర్‌‌ బాలికల విభాగంలో జరిగిన మూడు రేస్‌‌ల్లోనూ నెగ్గిన లాహిరి (రసూల్‌‌పురా ఉద్భవ్‌‌ స్కూల్‌‌) మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఆమె సోదరి దీక్షిత (10 పాయింట్లు), బిందు రత్లావత్‌‌ (27 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 

ఈ పోటీల్లో బాలురు, బాలికలు అందరూ ఒకే ఫ్లీట్‌‌లో పోటీ పడుతున్నారు. బాలుర విభాగంలో వికారాబాద్‌‌కు చెందిన టాప్ సీడ్ బన్నీ బొంగూర్ (12 పాయింట్లు) కొంచెం ఫామ్‌‌లో కనిపించకపోయినా అగ్రస్థానంలో నిలిచాడు. పెద్దగా అంచనాలు లేని వినోద్ దుండూ (14 పాయింట్లు),సాథ్విక్ ధోకీ (24 పాయింట్లు) రెండు, మూడు ప్లేస్‌‌లను సాధించారు. తక్కువ బరువున్న సెయిలర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన హాఫ్ రిగ్ సెయిల్స్‌‌ను ఉపయోగించి జూనియర్‌‌‌‌ విభాగం సెయిలర్లు శుక్రవారం పోటీ పడనున్నారు.