లాల్ సలామ్ పోస్టర్ రిలీజ్

లాల్ సలామ్ పోస్టర్ రిలీజ్

సినిమా సూపర్ స్టార్ రజనీ కాంత్, క్రికెట్ స్టార్ కపిల్ దేవ్‌ ఒకే తెరపై కనిపించబోతున్నారు. రజనీ నటిస్తున్న లాల్ సలామ్ సినిమాలో కపిల్ దేవ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రజనీ కూతురు ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై  రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నాడు. 

విష్ణు విశాల్‌, విక్రాంత్ లీడ్ రోల్స్‌ ప్లే చేస్తున్నారు. అయితే ఇవాళ కపిల్‌ దేవ్‌ బర్త్ డే సందర్భంగా లాల్‌ సలామ్‌ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో కపిల్‌ దేవ్‌, రజనీకాంత్ మైదానంలో నడుచుకుంటూ ముచ్చటిస్తున్నారు. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్‌‌కి లాల్ సలామ్ టీం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ లైకా ప్రొడక్షన్స్ ఈ పోస్టర్ విడుదల చేసింది.