ఎర్రవల్లి లో భూముల రీసర్వే షురూ

ఎర్రవల్లి లో భూముల రీసర్వే షురూ

ములుగు/ గజ్వేల్, వెలుగు:- సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల పరిధిలో భూముల రీ సర్వే ప్రారంభమైంది. ఆయా గ్రామాల పరిధిలో భూముల హద్దులు నిర్ణయించేందుకుగాను రెవెన్యూ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.  

ఈ క్రమంలో శనివారం డివిజనల్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు బానోతు సేవియా నాయక్, వంశీ ఆధ్వర్యంలో రెవెన్యూ, ల్యాండ్ సర్వే డిపార్ట్​మెంట్​ సిబ్బంది రెండు టీమ్​ లుగా ఏర్పడి ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల్లో భూముల రీ -సర్వే ప్రక్రియ మొదలుపెట్టారు. ఒక్కో టీమ్​లో ఆరుగురు సిబ్బందితో రెండు బృందాలుగా రీ-సర్వే నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాల శివారు హద్దులను నిర్ణయించేందుకు ఈ సర్వే చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.