ట్యాంక్ బండ్ లో దూకి యువతి ఆత్మహత్యా యత్నం

ట్యాంక్ బండ్ లో దూకి యువతి ఆత్మహత్యా యత్నం

హైదరాబాద్ లంగర్ హౌజ్ కి చెందిన ఓ యువతి ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఓల్డ్ లవ్ హైదరాబాద్ పికెట్ లో ఉన్న హోంగార్డు కామేశ్వరరావు వెంటనే ట్యాంక్ బండ్ లోకి దిగి యువతిని కాపాడాడు. వెంటనే చికిత్స నిమిత్తం యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే యువతి ఆత్మహత్యయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.